మేడ్చల్ ఓఆర్ఆర్‎పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడు స్పాట్ డెడ్

మేడ్చల్ ఓఆర్ఆర్‎పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడు స్పాట్ డెడ్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ యువకుడిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

మృతుడిని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారం గ్రామానికి చెందిన కిషోర్‎గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‎మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధులు కన్నీరుమున్నీరుగా విలపించారు.