
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఘటన
దండేపల్లి, వెలుగు: పొలాలు చూసేందుకు దోస్తులతో కలిసి వచ్చి స్కూటీ మొరం కుప్పను ఢీకొని పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన రుద్ర వంశీకృష్ణ(16) హైదరాబాద్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు నలుగురు మిత్రులతో కలిసి స్కూటీపై దండేపల్లి మండలం వెల్గనూరు వైపు పొలాలు చూడడానికి వెళ్తూ నంబాల గ్రామ సమీపంలో రోడ్ పక్కనే ఉన్న మొరం కుప్పను ఢీకొట్టాడు. స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోయాడు. ఇదిలాఉంటే మృతుడి తండ్రి రుద్ర రవి కుమార్ 9 నెలల కింద గుండె పోటుతో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసీనోద్దీన్ తెలిపారు.