రూ.10 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు..బోడుప్పల్ లో ప్రారంభించిన మాజీ మేయర్ అజయ్ యాదవ్

రూ.10 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు..బోడుప్పల్ లో ప్రారంభించిన మాజీ మేయర్ అజయ్ యాదవ్

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి రెసిడెన్సీ నుంచి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వరకు రూ.10 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఈ పనులకు శుక్రవారం మాజీ మేయర్ అజయ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..  బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్​ మేడ్చల్ నియోజకవర్గ ఇన్​చార్జి తోటకూర వజ్రేశ్​యాదవ్​ పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్, చీరాల నర్సింహా, రాములు, పులకండ్ల జంగా రెడ్డి, రంగా బ్రహ్మన్నగౌడ్, శివశంకర్   పాల్గొన్నారు.