
- శామీర్‌పేట పీఎస్ పరిధిలో ఘటన
శామీర్ పేట,వెలుగు : పోలీసులమని చెప్పి ఓ రైతుపై దాడి చేసిన కొందరు వ్యక్తులు డబ్బు లాక్కెళ్లారు. ఈ ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా రామారం గ్రామానికి చెందిన రైతు బకొల్ల దుర్గయ్య అనే వ్యక్తి బోయిన్ పల్లి మార్కెట్‌లో టమాటలు అమ్మి వెహికల్లో తిరిగి సిద్దిపేటకు వెళ్తున్నాడు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ దాటగానే రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు దుర్గయ్యను అడ్డుకున్నారు.
బైక్‌లను అతడి వెహికల్ కు అడ్డుగా పెట్టారు. తాము పోలీసులమని చెప్పారు. వెహికల్లో గంజాయి తరలిస్తున్నావంటూ దుర్గయ్యను వారు బెదిరించారు. అదే వెహికల్లో బాలాజీ మరో వ్యక్తిని దొంగలు కత్తితో బెదిరించారు.అనంతరం దుర్గయ్యపై దాడి చేశారు. అతడి దగ్గరున్న రూ.17 వేలను లాక్కుని పారిపోయారు. బాధితుడి కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.