సిటీలో రెచ్చిపోతున్న దొంగలు

V6 Velugu Posted on Jan 19, 2022

హైదరాబాద్ లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. సిటీలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్ జరిగాయి. అడ్డగుట్ట రియో పాయింట్ హోటల్ దగ్గరి నుండి 60 సంవత్సరాల మహిళ నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. మారేడ్ పల్లి సంజీవయ్య నగర్ లో మరో 60 సంవత్సరాల మహిళ మెడలోని నాలుగు తులాల చైన్ లాక్కెళ్లారు. 

ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న తుకారాం గేట్.. మారేడ్ పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు వెళ్లిన వారి ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గత 15రోజులుగా మూడు పోలీస్ స్టేషన్ల (జగద్గిరిగుట్ట,కెపిఎచ్ బి,దుందిగల్,) పరిధిలో దొంగ తనాలు చేస్తూ 5 కేసుల్లో నిందుతులు గా పరారీలో ఉన్నారు.

జగద్గిరి గుట్ట క్రైమ్ టీమ్ ఏఎస్సై కిష్టయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ లో నిందితులను గుర్తించి 20 కేసుల్లో  ముద్దాయి గా ఉన్న దేరంగుల రవి(20) అనే నిందితున్ని అరెస్ట్ చేశమన్నారు. వారి వద్ద నుండి 75 తులాల వెండి,11తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న భరత్, హరి అనే నిందుతుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. 

ఇవి కూడా చదవండి: 

ఏపీలో కరోనా టెస్టులపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

ఉద్యోగం లేదు.. ఉన్న భూమి సర్కారు లాక్కొంది

Tagged robbery, chain snatching, Telangana News, Hyderabad crime

Latest Videos

Subscribe Now

More News