ఏపీలో కరోనా టెస్టులపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

ఏపీలో కరోనా టెస్టులపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిన్న లేఖ రాసింది. కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని సూచించింది. ఆస్పత్రులపై కేసుల భారం ఒక్కసారిగా పెరిగిపోకుండా చూడాలంటే టెస్టింగ్, ట్రేసింగ్ కీలకమని, ఈ విషయంలో అలసత్వం వద్దని పేర్కొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా టెస్టింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో టెస్టు చేయించుకునే వారికి రేట్లు మరింత అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. టెస్టు కాస్ట్, పీపీఈ కిట్లు అన్నింటి ఖర్చు కలిపి ప్రైవేట్ ల్యాబ్‌లు ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.350కి మించి చార్జ్ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా టెస్టులు కిట్లు తయారు చేసే కంపెనీలు పెరగడంతో పాటు మార్కెట్‌లో వీటి రేట్లు తగ్గినందున టెస్టు రేట్లు తగ్గించాలని ఆరోగ్య శాఖ టెక్నికల్ కమిటీ సిఫారసు చేయడంతో పై నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రేట్లు బోర్డులు పెట్టాలి

ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్స్‌లో మాత్రమే కరోనా టెస్టులు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన టెస్టు రేట్లను కనిపించేలా బోర్డులు పెట్టాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ రేట్లు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయడంతో పాటు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు సూచించింది. ఈ కొత్త రేటు అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకూ వర్తిస్తుందని పేర్కొంది. ఒక వేళ ఈ రేట్లను అమలు చేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

ఇప్పట్లో కరోనాకు అంతం లేనట్లే

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

కరోనా టెన్షన్: ఫిబ్రవరి 13వరకు కఠిన ఆంక్షలు