ఫిబ్రవరి 13వరకు కఠిన ఆంక్షలు

V6 Velugu Posted on Jan 19, 2022

జపాన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. టోక్యోలోని పలు ప్రాంతాల్లో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ కట్టడి కోసం జపాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వీటిని ఈనెల 21 నుంచి అమలు చేయనుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే 13 ప్రాంతాల్లో ఫిబ్రవరి 13 వరకు కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంపై ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనిపై జపాన్ ప్రధాని  అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కట్టడికి జపాన్ ప్రభుత్వం లాక్ డౌన్లను అమలు చేసింది. ఈసారి మాత్రం బార్లు, రెస్టారెంట్లను మూసివేసేందుకే మొగ్గుచూపుతోంది. ప్రజలు మాస్కులు ధరించాలని..సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరూ కరోనా రూల్స్ పాటించాలని చెబుతున్నారు. 


మరిన్ని వార్తల కోసం 

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

Tagged tokyo, japan, Covid cases, new restrictions, 13 areas under a three week

Latest Videos

Subscribe Now

More News