
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నాడు. అందుకు అనుమతి కావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.యడవల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే యువకుడు... అధికారులు తన భూమి లాక్కొన్నారని ఆరోపిస్తున్నాడు. పల్లె ప్రకృతి వనం పేరుతో తమ 5 ఎకరాల భూమిని లాక్కున్నారని విమర్శించాడు. దీంతో తాము ప్రస్తుతం ఉపాధి లేక రోడ్డున పడ్డామని అధికారులకు ,స్థానికి నల్గొండ ఎమ్మెల్యే పలుమార్లు విన్నవించుకున్నా.. వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నాడు. కేటీఆర్ కి ట్విట్టర్ వేదిక 100 పోస్టులు చేసిన తమ గోడు పట్టించుకోవడం లేదని .చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ఉద్యోగం లేక.. ఉన్న భూమి కూడా ప్రభుత్వం లాక్కోవడంతో దిక్కుతోచని తమకు ఆత్మహత్య శరణ్యమని శ్రీను వాపోతున్నాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాడు. ‘ కేటీఆర్ గారు కనీసం ఈ సాయం అయినా చేయండి’ అంటూ శ్రీను సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
@KTRTRS @TelanganaCMO @revanth_anumula @KomatireddyKVR @TeenmarMallanna @Tolivelugu @Collector_NLG @bandisanjay_bjp @BjpAchary @jagadishTRS @DHARMENDHARGG కేటీఆర్ గారు కనీసం ఈ సహాయం అయిన చేయండి pic.twitter.com/UGgYsFtYtJ
— Srinivas Choppari (@SrinivasChoppa3) January 19, 2022
ఇవి కూడా చదవండి:
ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్
ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు