తుపాకీతో బెదిరించి చోరీ, గాల్లోకి కాల్పులు

తుపాకీతో బెదిరించి చోరీ, గాల్లోకి కాల్పులు

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలోని వినాయక వైన్స్ పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం తుపాకీతో బెదిరించి రూ.2లక్షల 8500 చోరీ చేశారు. ఈ సమయంలో సిబ్బంది ఎదురు తిరగడంతో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కానీ అది మిస్సయి షట్టర్ కు తగిలింది.

ఆ తర్వాత కర్రలతో కొట్టి ద్విచక్ర వాహనంపై  పారిపోతుండగా సిబ్బంది కేకలు వేశారు. దీంతో మళ్లీ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు చేసి దుండగులు అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న శామీర్ పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.