మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధి నాగారం మున్సిపాలిటీలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కమలా బాయ్ కాలనీలో ఉంటున్న వెంకటయ్య అనే వ్యక్తి మే 5వ తేదీ శుక్రవారం ఉదయం బంధువుల ఊరికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లి చూసేసరికి, బెడ్‌రూంలో బీరువా తెరిచి ఉండగా.. బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని వెంకటయ్య గుర్తించాడు.
రెక్కి చేసిన దొంగలు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని..ఇట్టి కిటికీలు పగలగొట్టి బీరువాలో దాచిన నాలుగు తులాల బంగారం, రెండు లక్షల ఇరవై వేల రూపాయల నగదు, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు దుండగులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాగారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.