వడోదరా: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేపథ్యంలో.. టీమిండియా శుక్రవారం మూడు గంటల కఠినమైన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపించారు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, రోహిత్.. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో బలమైన షాట్లు కొట్టారు. నెట్స్‌లో వేరియబుల్ బౌన్స్, టర్నింగ్ బాల్స్‌ను దీటుగా ఎదుర్కొన్నారు.
త్రో డౌన్ స్పెషలిస్ట్‌తో కలిసి దాదాపు గంటన్నర ప్రాక్టీస్ చేశారు. అయితే గురువారం విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సిరాజ్ ఈ ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురు సాయంత్రం టీమ్‌తో కలిశారు. కాలి గాయంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు రన్నింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. బౌలర్లు తమ ఫామ్‌ను సరిచూసుకోగా, ఫీల్డింగ్ సెషన్‌లో అందరూ పాల్గొన్నారు. ఆదివారం ఇండియా, కివీస్ మధ్య తొలి వన్డే జరగనుంది.
