ముంబై నుంచి హార్ధిక్ ఔట్..! MI కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ రోహిత్ చేతికే ?

ముంబై నుంచి హార్ధిక్ ఔట్..! MI కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ రోహిత్ చేతికే ?

IPL-2026 లో ఫ్లాప్ షో తర్వాత ముంబై ఇండియన్స్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు టాక్. అందులో భాగంగా కొద్ది రోజులుగా ఫ్రాంఛైజీతో ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్న హార్ధిక్ పాండ్యాను సాగనంపేందుకు మేనేజ్మెంట్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ పంపించే లోపే తానే క్విట్ అవ్వాలనే ప్లాన్ లో పాండ్యా ఉన్నట్లు ఐపీఎల్ సర్కిల్ లో చర్చలు నడుస్తున్నాయి. 

ఐపీఎల్ 2026లో 14 మ్యాచ్ లు ఆడిన ముంబై.. కేవలం 4 మాత్రమే గెలిచింది. హార్ధిక్ కెప్టెన్సీలో టీమ్ దారుణంగా ఢీలా పడటంతో.. ఇక తెగతెంలపులు చేసుకుందామని డిసైడ్ అయ్యిందట. 2024 లో ముంబై కెప్టెన్ గా ఎంపికైన  పాండ్యా వెళ్లిపోతే.. ప్రస్తుతం కెప్టెన్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

  • కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ చేతుల్లో..

ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే కెప్టెన్సీ కాకపోయినా.. తదుపరి కెప్టెన్ గా ఎవరిని నియమంచాలనే బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

రోహిత్ ను తొలగించి తప్పు చేసిందా..?

2023లో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్ధిక్ పాండ్యాను నియమించింది ముంబై ఇండియన్ యాజమాన్యం. ఆ నిర్ణయమే కొంప ముంచింది అనే క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. చేసిన తప్పును తెలుకున్న ముంబై ఫ్రాంచైజీ.. మరోసారి అలాంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తదుపరి కెప్టెన్ ను నియమించే బాధ్యత రోహిత్ కు అప్పగించనుంది టీమ్ మేనేజ్మెంట్. 

రోహిత్ ఆశీర్వాదం ఉన్న ప్లేయర్ నే కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉందని సోర్సెస్ నుంచి సమాచారం. ఇండియా మాజీ ప్లేయర్, టాప్ కోచ్ లలో ఒకరు ఈ విషయాన్ని కన్ఫమ్ చేసినట్లు చెబుతున్నారు. ముంబై మేనేజ్మెంట్ తో మంచి సంబంధాలు లేవని.. త్వరలోనే టీమ్ కు గుడ్ బై చెబుతానని సన్నిహితులతో హార్ధిక్ చెప్పినట్లు టాక్.