Rohit Sharma: అన్ని వరల్డ్ కప్‌లు ఆడాను.. ఇంట్లో కూర్చొని టోర్నీ చూడడం కొత్తగా అనిపిస్తుంది: రోహిత్ శర్మ

Rohit Sharma: అన్ని వరల్డ్ కప్‌లు ఆడాను.. ఇంట్లో కూర్చొని టోర్నీ చూడడం కొత్తగా అనిపిస్తుంది: రోహిత్ శర్మ

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మకు ఎవరికీ లేని ఒక ప్రత్యేక రికార్డ్ ఉంది. అదేంటో కాదు ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీలు హిట్ మ్యాన్ ఆడేశాడు. 2007లో తొలిసారి మొదలైన టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ ప్లేయర్ గా ఉన్నాడు. తొలిసారి జరిగిన ఈ పొట్టి ప్రపంచ కప్ ను ఇండియా సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా రోహిత్ టీ20 వరల్డ్ కప్ మిస్ కాకుండా ఆడాడు. ఓవరాల్ గా జరిగిన 9 టీ20 వరల్డ్ కప్ హిట్ మ్యాన్ ఆడి ఈ ఫార్మాట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

2026 టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే జరగనుంది. తొలిసారి రోహిత్ శర్మ లేకుండా ఇండియా టీ20 వరల్డ్ కప్ ఆడుతుంది. ఈ భావన తనకు చాలా కొత్తగా ఉందని హిట్ మ్యాన్ తెలిపాడు.. రోహిత్ శర్మ మాట్లాడుతూ.. " ఈ సారి జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను మేము ఇంట్లో కూర్చొని చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత ప్రతి వరల్డ్ కప్ నేను ఆడాను. తొలిసారి జట్టులో లేకపోవడం చాలా భిన్నంగా అనిపిస్తుంది. జట్టు టీ20 మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు నేను జట్టులో మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉండదు. కానీ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో లేకపోతే మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది నాకు కొత్త అనుభూతి. వరల్డ్ కప్ కోసం అందరిలాగే నేను ఎదురు చూస్తున్నాను". అని జియో హాట్ స్టార్ తో రోహిత్ శర్మ తెలిపాడు. 

2026 వరల్డ్ కప్ కు 18 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. మరోసారి ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉండడంతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా. అంచనాలకు తగ్గట్టుగా ఆడితే భారత జట్టు టైటిల్ నిలబెట్టుకోవచ్చు.  

►ALSO READ | BPL 2025: చివరి బంతికి ఆరు పరుగులు.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన ఇంగ్లాండ్ ప్లేయర్.. వీడియో వైరల్

భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.