MI vs RCB: రోహిత్ శర్మ హింట్: టీ20 వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తీక్

MI vs RCB: రోహిత్ శర్మ హింట్: టీ20 వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తీక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో చెలరేగి ఆడుతున్నాడు. ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వాతం అనే ట్యాగ్ కు న్యాయం చేస్తున్నాడు. జట్టు గెలుపోటములను పక్కన పెడితే ఈ వెటరన్ వికెట్ కీపర్ మాత్రం దంచికొడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా.. బౌలర్ ఎవరైనా విరుచుకుపడుతున్నాడు. ఏప్రిల్ నెల చివర్లో టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా వికెట్ కీపర్ రేస్ లోకి వచ్చాడు. కార్తీక్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిన రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ముంబైలోని వాంఖడే వేదికగా నిన్న (ఏప్రిల్ 11) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ మరోసారి తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు. 23 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కార్తీక్ కొట్టిన కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ దగ్గరకు వచ్చి సరదాగా ఆట పట్టించాడు. ఆ సమయంలో హిట్ మ్యాన్​ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.  శెభాష్ కార్తీక్.. ప్రపంచకప్ ఆడేందుకే కదా ఇలా రెచ్చిపోతున్నావ్​ అంటూ టీజ్ చేశాడు. కామెంటేటర్లు కూడా టీ20 వరల్డ్ కప్​ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ పోటీ పడుతున్నట్లు అన్నాడు. 

ఇప్పటివరకు దినేష్ కార్తీక్ చెన్నై తో జరిగిన తొలి మ్యాచ్ లో 26 బంతుల్లోనే 38* పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కేకేఆర్ పై 8 బంతుల్లోనే 20 పరుగులు.. నిన్న (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ పై 23 బంతుల్లో 53 పరుగులు చేసి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కార్తీక్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన ఆశ్చర్యం లేదు.