భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవం అందుకోనున్నాడు. అజీంక్య డివై పాటిల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ (డి.లిట్.) అందుకోనున్నారు. శనివారం (జనవరి 24) జరిగే 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రోహిత్ శర్మకు ఈ సన్మానం జరగనుంది. రోహిత్ క్రీడల్లో చేసిన అసమానమైన కృషికి.. అదేవిధంగా చాలా మందికి స్ఫూర్తినిచ్చిన కారణంగా డాక్టరేట్ గౌరవంతో సత్కరించనున్నారు. అభిమానులు క్రికెట్‌లో 'హిట్‌మ్యాన్' గా పిలుచుకునే రోహిత్ కు ఇది అతని కెరీర్ లో ఒక గొప్ప గౌరవంగా నిలిచిపోనుంది.
ఈ వేడుకకు విశ్వవిద్యాలయ అధ్యక్షుడు.. ఛాన్సలర్ డాక్టర్ అజీంక్య డి.వై. పాటిల్ అధ్యక్షత వహిస్తారు. ఈ వేడుక స్టార్‌లతో నిండి ఉంటుందని.. రోహిత్ ప్రధాన ఆకర్షణగా ఉంటారని ప్రకటించింది. రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఒకటే ఫార్మాట్ లో ఆడుతున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినా తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు టెస్ట్ సిరీస్ కు కూడా గుడ్ బై చెప్పాడు. వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ALSO READ | Abhishek Sharma: దేశం కోసం చాలా చేశాడు.. అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాను: అభిషేక్ శర్మ
తన కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 ఫిఫ్టీలు ఉన్నాయి. 2013లో ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను గతేడాది మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో గత వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఇండియాను నడిపించిన రోహిత్ 24 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఇండియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గి తొమ్మిదింట్లో ఓడింది. మూడు డ్రాగా ముగిశాయి.
గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత షార్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్.. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఇండియాకు ఆడనున్నాడు. 159 టీ20 మ్యాచ్ ల్లో రోహిత్ 4231 పరుగులు చేశాడు. కెప్టెన్ గా ఇండియాకు 2024 టీ20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే ఫార్మాట్ లో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించి ఏడాదిలోనే ఇండియాకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ గా నిలిచాడు. 2023 లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ తో పాటు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. బ్యాటర్ గా 282 వన్డేలాడిన రోహిత్ 11577 పరుగులు చేశాడు.
