సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు… కెరీర్‌లో మరో ప్రమోషన్ లభించింది. ఫస్ట్ టైమ్ టీమిండియా టెస్ట్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్ట్‌లకు హిట్‌మ్యాన్.. రహానె డిప్యూటీగా పని చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. క్వారంటైన్ ముగించుకుని టీమ్‌తో చేరిన రోహిత్.. సిడ్నీ టెస్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ కూడా దక్కిందంటే కచ్చితంగా ఫైనల్ ఎలెవన్‌లో ఉంటాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. చతేశ్వర్ పుజారా ప్లేస్‌లో రోహిత్ బాధ్యతలు చేపడతాడు. ‘వైస్ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. విరాట్ బ్రేక్‌లో ఉన్నాడు కాబట్టి రహానె ఎలివేట్ అయ్యాడు. టీమ్‌లో మరో సీనియర్ లేడు కాబట్టి పుజారాకు చాన్స్ దక్కింది. రహానె–పుజారా.. స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్స్ మాత్రమే. వైట్‌బాల్ ఫార్మాట్‌లో రోహిత్ ఎప్పట్నించో డిప్యూటీగా ఉన్నాడు. టీమ్ లీడర్‌షిప్ గ్రూప్‌లో హిట్‌మ్యాన్ కూడా ఓ భాగం. అందుకే ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించాడు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ నెల 7 నుంచి మొదలయ్యే మూడో టెస్ట్‌లో ఆడేందుకు రోహిత్‌కు లైన్ క్లియర్ అయినట్టే.
For More News..
డిసెంబర్‌లో జీఎస్‌టీ కలెక్షన్స్ టాప్..
సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
న్యూ ఇయర్‌కు నిమిషానికి 5వేలకు పైగా ఆర్డర్లు

