
గచ్చిబౌలి, వెలుగు : వాన పడినప్పుడు ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా రోడ్లపై వరద నీరు నిల్వకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని కమిషనర్ రోనాల్డ్రాస్సూచించారు. ఐటీ కారిడార్‌లో సోమవారం ఉదయం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి రోనాల్డ్ రోస్ పర్యటించారు. ఐకియా జంక్షన్, లెమన్‌ట్రీ, సైబర్ టవర్స్, ఎన్ఐఏ కైత్లాపూర్ఆర్ఓబీ, గోకుల్ ఫ్లాట్స్, ఫోరంమాల్, బొటానికల్ గార్డెన్, ఐఐఐటీ జంక్షన్, డెలాయిట్రోడ్, రాడిసన్ హోటల్ ప్రాంతాల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ పాయింట్ల ప్రాంతాలను పరిశీలించారు.
ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, బాటిల్‌నెక్ ప్రాంతాలను తొలగించడం, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధిపై చర్చించారు. కమిషనర్, సీపీ వెంట ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఓటరు జాబితాలో పేర్లను సరిచూసుకోవాలిరాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తప్పులు లేకుండా ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్లు జాబితాలో తమ పేరు సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం అన్నింటికి ఫారం-–8 ద్వారా ఆన్లైన్లో www.voters. eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు.