రోస్టర్ విధానాన్ని సవరించాలి: మాల సంఘాల జేఏసీ వినతి

రోస్టర్ విధానాన్ని సవరించాలి: మాల సంఘాల జేఏసీ వినతి

బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ జీవో నంబర్ 99 కారణంగా తీసుకొచ్చిన రోస్టర్ విధానాన్ని సవరించాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని జేఏసీ చైర్మన్ డాక్టర్ మందల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్‌‌ బుధవారం (సెప్టెంబర్ 10) కలిశారు. 

ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి, గ్రూప్- 3లో 26 ఉప కులాలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించారన్నారు. ఈ రోస్టర్​ను 20 లోపు రెండు పాయింట్లకు సవరించాలని కోరారు. లేదంటే మాల సమాజానికి చెందిన 40 లక్షల మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ విషయమై సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ సమస్యను మంత్రివర్గ ఉప సంఘంతోపాటు సీఎం దృష్టికి తీసుకెళ్లి జీవో 99 వల్ల కలిగే నష్టాలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వేం నరేందర్​రెడ్డి హామీ
 ఇచ్చారు.