చెంచులకు వాటర్ ఆన్ వీల్స్ పంపిణీ

చెంచులకు వాటర్ ఆన్ వీల్స్  పంపిణీ

అమ్రాబాద్, వెలుగు:  తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న చెంచులకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్, కోనేరు సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ఆన్ వీల్స్ అందించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా మండలం ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన 40 చెంచు కుటుంబలకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి కన్న మాట్లాడుతూ.. ఈ వాటర్ ఆన్ వీల్స్ ద్వారా ఎంత దూరం నుంచైనా నీటిని తీసుకురావచ్చన్నారు.  ఏపీఓ రఘు, బాలకృష్ణ, సోమశాస్త్రి, శ్రీనివాస్, వినోద్, వైశాలి ఉన్నారు.