ఇంటర్నేషనల్ కాల్స్‌‌‌‌‌‌‌‌ను లోకల్​ కాల్స్​గా రూటింగ్

ఇంటర్నేషనల్ కాల్స్‌‌‌‌‌‌‌‌ను లోకల్​ కాల్స్​గా రూటింగ్
  • సంతోశ్​నగర్, బాలాపూర్​కేంద్రంగా ఇల్లీగల్​ ఎక్స్ చేంజ్
  • ఇద్దరు అరెస్ట్.. 204 బీఎస్ఎన్ఎల్​ సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డులు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఇంటర్నేషనల్ ఫోన్​కాల్స్‌‌‌‌‌‌‌‌ను లోకల్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ రూటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఇద్దరిని సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సంతోశ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాలాపూర్ ఏరియాల్లో నిర్వహిస్తున్న ఇల్లీగల్ ఇంటర్నేషనల్ టెలిఫోన్ ఎక్స్​చేంజ్‌‌‌‌‌‌‌‌లను సీజ్ చేశారు. 204 బీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డులు,6 ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, 3 రూటర్లు, హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను టెలికామ్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులతో కలిసి టాస్క్​ఫోర్స్​డీసీపీ షర్మి పెరుమాళ్ వెల్లడించారు. యాకుత్​పురాలోని అమాన్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హిదాయత్‌‌‌‌‌‌‌‌ అలీ(40) సంతోశ్​నగర్‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్​చేస్తుంటాడు. అలాగే ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ టెలిఫోన్ ఎక్స్​చేంజ్​నడిపిస్తున్నాడు. హిదాయత్‌‌‌‌‌‌‌‌ అలీతో కలిసి బోరబండకు చెందిన ముజీబ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌(40) బాలాపూర్ పీఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని మెట్రో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మరో ఎక్స్​చేంజ్‌‌‌‌‌‌‌‌ఆపరేట్ చేస్తున్నాడు. ఈ రెండు సెంటర్ల నుంచి సౌదీ, ఖతార్‌‌‌‌‌‌‌‌, దుబాయ్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర దేశాలకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు కాల్‌‌‌‌‌‌‌‌ రూటింగ్ చేస్తున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ పరికరాలను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్​కాల్స్‌‌‌‌‌‌‌‌ను లోకల్ కాల్స్‌‌‌‌‌‌‌‌గా మార్చే విధంగా సెటప్ చేశారు. ఇందుకోసం 204 బీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సిమ్ కార్డులను కొనుగోలు చేశారు.

దేశ భద్రతకే ముప్పు

ఈ రెండు సెంటర్లలో ఇంటర్నేషనల్ నంబర్లను కాలింగ్‌‌‌‌‌‌‌‌ లైన్ ఐడేంటిఫికేషన్‌‌‌‌‌‌‌‌(సీఎల్‌‌‌‌‌‌‌‌ఐ)లో ఇండియన్ నంబర్లుగా కనిపించే సెటప్ చేశారు. దీంతో ఇంటర్నేషనల్ లాగ్ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌(ఐఎల్‌‌‌‌‌‌‌‌డీ)ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియన్ కాల్స్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తారు. కాల్‌‌‌‌‌‌‌‌ రేట్లు టెలికాం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించిన లోకల్‌‌‌‌‌‌‌‌ టారిఫ్‌‌‌‌‌‌‌‌ కిందనే ఉంటాయి. ప్రధానంగా దుబాయ్, ఖతార్, సౌదీ నుంచి వచ్చే ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ను వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నెట్ ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌(వీఓఐపీ)ద్వారా లోకల్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌గా మార్చుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వీఓఐపీ కాల్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం సాధ్యం కాదు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ లాంటి దేశాల నుంచి వచ్చే కాల్స్‌‌‌‌‌‌‌‌ను ట్రేస్ చేసే అవకాశాలు లేవు. ఇలాంటి ముఠాలతో దేశ ఆర్థిక వ్యవస్థతతోపాటు భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది.

ఇలా దొరికారు..

సంతోశ్​నగర్ పూల్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి విదేశాలకు ఎక్కువగా కాల్స్‌‌‌‌‌‌‌‌ వెళ్తున్నట్లు టెలికాం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు గుర్తించారు. బీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డుల ద్వారా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ రూటింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సమాచారం సేకరించారు. సిటీ పోలీసులకు సమాచారం అందించారు. సౌత్‌‌‌‌‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులతో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. హిదాయత్‌‌‌‌‌‌‌‌ అలీ, ముజీబ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌లను అరెస్ట్​చేసి, సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డులు,సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఎక్స్​చేంజ్​ల నుంచి వెళ్లిన కాల్స్‌‌‌‌‌‌‌‌ డేటాను సేకరిస్తున్నారు.