ఓల్డ్ సిటీ, వెలుగు: ఓల్డ్ సిటీలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. షాహీన్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ అమెర్(32)ను నాడి హోటల్ వాడి ఇముస్తఫా వద్ద 8 మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపేశారు. మృతుడు అమెర్ 2024లో జరిగిన ముబారక్ సిగర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేంద్ర తెలిపారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
