నలుగురిపై బ్లేడుతో రౌడీషీటర్ గ్యాంగ్ దాడి

నలుగురిపై బ్లేడుతో రౌడీషీటర్ గ్యాంగ్ దాడి

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లిలోని దర్గా షాఖామూష్ వద్ద ఓ రౌడీషీటర్ తన గ్యాంగ్​తో కలిసి అర్ధరాత్రి హల్​చల్​ చేశాడు. నలుగురిపై బ్లేడుతో దాడి చేశాడు. హబీబ్ నగర్ సీఐ సైదిబాబు వివరాల ప్రకారం.. హబీబ్ నగర్​కు చెందిన లతీఫ్ అనే వ్యక్తి గురువారం రాత్రి 11.30 గంటలకు డ్యూటీ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. స్థానిక  రౌడీ షీటర్ మోయిద్ తన స్నేహితులతో కలిసి లతీఫ్ ను అడ్డుకొని డబ్బులు ఇవ్వమని బెదిరించి దాడి చేశాడు.

బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని  తన అన్న మహమ్మద్ జహూర్​కు చెప్పాడు. అతను వచ్చి ప్రశ్నించగా.. మోయిద్, అతడి ఫ్రెండ్స్​ జహూర్ ఛాతిపై బ్లేడుతో దాడి చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జహూర్ తండ్రి, అతని సోదరి అడ్డుకోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న హాబీబ్ నగర్ పోలీసులు పరిస్థితి విషమంగా ఉన్న జహూర్​ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.