IPL 2025 Final: లివింగ్ స్టోన్, వైశుక్ ఔట్.. ఫైనల్‌కు ఒక మార్పుతో పంజాబ్, బెంగళూరు

IPL 2025 Final: లివింగ్ స్టోన్, వైశుక్ ఔట్.. ఫైనల్‌కు ఒక మార్పుతో పంజాబ్, బెంగళూరు

ఐపీఎల్ 2025 ఫైనల్ కు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు చేరుకున్నాయి. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ముంబై ఇండియన్స్ పై విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు బెంగళూరు అంతకు మించిన కాన్ఫిడెంట్ తో బరిలోకి దిగుతుంది. ఎవరు గెలిచినా ఐపీఎల్ లో చరిత్రే. ఎవరు ఓడినా ఆ జట్టుకు తీవ్ర బాధ తప్పదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా లేని ఇరు జట్లు తొలిసారి ట్రోఫీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఫైనల్లో ఇరు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతాయో ఆసక్తికరంగా మారింది. ఫైనల్ మ్యాచ్ కోసం పంజాబ్, బెంగళూరు జట్లు ఒక మార్పుతో బరిలోకి దిగనున్నాయి. పంజాబ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముంబైపై క్వాలిఫయర్ 2 ఆడిన విజయ్ కుమార్ వైశుక్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ హరిప్రీత్ బ్రార్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్రార్ కు కోహ్లీ పై మంచి రికార్డ్ ఉంది. గతంలో చాల సార్లు కోహ్లీని ఔట్ చేశాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో ఈ ఒక్క మార్పుతో పంజాబ్ ఫైనల్ ల్లో ఆడే అవకాశం ఉంది. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు విషయానికి వస్తే  గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన టిమ్ డేవిడ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నట్టు సమాచారం. ఫైనల్లో డేవిడ్ లివింగ్ స్టోన్ స్థానంలో ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఆర్సీబీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ రజత్ పటిదార్ ఫామ్ లోకి వస్తే బెంగళూరు జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో అత్యంత దుర్బేధ్యంగా కనిపిస్తుంది. భువనేశ్వర్, హేజల్ వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్ ఫైనల్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 (అంచనా):

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 (అంచనా):

ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, హరిప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్