టాస్ గెలిచిన ఆర్సీబీ.. గిల్ సేనకు బ్యాటింగ్ అప్పగించిన పాటిదార్.. ఇరు జట్లలో మార్పులు ఇవే!

టాస్ గెలిచిన ఆర్సీబీ.. గిల్ సేనకు బ్యాటింగ్ అప్పగించిన పాటిదార్.. ఇరు జట్లలో మార్పులు ఇవే!

IPL 2026 Final: ఐపీఎల్ 2026 మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ వేదిక సిద్ధమైంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఈ పిచ్ చాలా బాగుంది, మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఇందులో పెద్దగా మార్పులు వస్తాయని నేను అనుకోవడం లేదు.. ఈ స్టేడియంలో మాకు గత ఏడాది మంచి మెమొరీస్ ఉన్నాయి.. ఈ మ్యాచ్ గెలవడానికి మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.. ప్రస్తుత క్షణంలో జీవించడం ముఖ్యం.. మన చేతుల్లో ఉన్న విషయాలను నియంత్రించడంపైనే మా ఫోకస్ అంతా ఉంటుంది.. ఈ భారీ స్టేడియంలో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే.. ఈ మ్యాచ్ కోసం మేము జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు, సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని పాటిదార్ చెప్పుకొచ్చాడు.

►ALSO READ | RCB vs GT మధ్య ఫైనల్ ఫైట్.. లైవ్ అప్డేట్స్ మీకోసం.. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఒకవేళ మేము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే ఎంచుకునేవాళ్లం.. ఇది రెగ్యులర్ వికెట్ లాగే ఉంది.. ఈ సీజన్లో ఇక్కడ మేము ఆడుతున్న మూడో మ్యాచ్ ఇది.. మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు మొదటి మూడు ఓవర్ల పాటు పిచ్ నుంచి కాస్త మూవ్‌మెంట్ (సహకారం) దొరికే అవకాశం ఉంది.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాలలో ఒకటి.. ఈ మ్యాచ్ కోసం మా జట్టులో ఒక మార్పు చేశాం.. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని గిల్ వెల్లడించాడు.