RCB vs PBKS Qualifier 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్టులో హేజల్ వుడ్

RCB vs PBKS Qualifier 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్టులో హేజల్ వుడ్

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫయర్ 1 ప్రారంభమైంది. చండీఘర్ వేదికగా ముల్లన్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిపోయిన జట్టు ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరలేదు. మరోవైపు 2014 తర్వాత పంజాబ్ ఫైనల్ కు వెళ్ళలేదు. ఈ రెండు జట్లకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు. 

ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఈ సారి ట్రోఫీ గెలవడానికి ఇదొక చక్కని అవకాశం.ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టులో గాయం నుంచి కోలుకొని స్టార్ ప్లేయర్ తుషార స్థానంలో జోష్ హేజల్ వుడ్ వచ్చాడు.  మరోవైపు పంజాబ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మార్కో జాన్సెన్ స్థానంలో అజమాతుల్లా ఓమార్జాయి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు.   

Also Read : ఇంత లూజ్ షాట్స్ ఆడితే ఎలా బాస్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ