పద్మారావునగర్, వెలుగు: రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బ్రాస్ బ్యాండ్ బృందాల ద్వారా ప్రత్యేక సంగీత ప్రదర్శనలు నిర్వహించనున్నది. ఈ నెల 21న బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద, 25న నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రదర్శనలు జరుగనున్నాయి. వందేమాతరం ఇతివృత్తంతో బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు ప్రదేశాల్లో సాయంత్రం 6 గంటల నుంచి సంగీత కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలని కోరారు.
