ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్పు వెనుక కుట్ర : బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు 

ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్పు వెనుక కుట్ర : బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఆర్) అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్పు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎక్కడెక్కడైతే భూములు కొన్నారో.. ఆ భూముల రేట్లు పెంచడానికే పాత అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చి కోల్డ్ స్టోరేజీలో పెట్టారని విమర్శించారు.

ఈ మేరకు మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి సీబీఐ విచారణ కోరకుండా కేవలం కొన్ని అంశాలకే పరిమితం చేయడం వెనుక ఎల్ అండ్ టీ సంస్థను రక్షించే ఉద్దేశం ఉందన్నారు. ఏఐసీసీ కార్యాలయ నిర్మాణానికి ఎల్ అండ్ టీ సహకరించిందని ఢిల్లీలో చర్చ జరుగుతోందని, ఆ సంస్థను కాపాడటానికే సీఎం నాటకాలు ఆడుతున్నారని చెప్పారు.