న్యూఢిల్లీ: మౌలిక వసతుల సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) మెటల్స్, మినరల్స్ విభాగంలో రూ.10–రూ.15వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులను దక్కించుకుంది. దేశంలోని అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు నుంచి కంపెనీ మొదటి ఆర్డర్ పొందింది.
ఛత్తీస్‌గఢ్‌లో 18 ఎంటీపీఏ సామర్థ్యం గల ఐరన్‌ఓర్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కనస్ట్రక్షన్ పనులనూ పూర్తి చేస్తుంది.
పశ్చిమ బెంగాల్లో మరో ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ చేపట్టిన స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులను కూడా ఎల్అండ్టీ దక్కించుకుంది. ఒక జింక్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కూడా ఈ సంస్థకు ఈపీసీ ఆర్డర్ లభించింది.
