జియో థర్మల్​ కేంద్రానికి రూ.1.72 కోట్లు రిలీజ్

జియో థర్మల్​ కేంద్రానికి రూ.1.72 కోట్లు రిలీజ్

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో ఏర్పాటు చేయనున్న జియో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంతాన్ని ఆఫీసర్లు, రీసెర్చ్​సెంటర్ ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. సంబంధిత వివరాలను సింగరేణి కంపెనీ ఆర్అండ్ డీ(రీసెర్చ్ అండ్​ డెవలప్​మెంట్) జీఎం సుభానీకి వివరించారు. కిలో మీటరు లోతు నుంచి వచ్చే వేడి నీటితో విద్యుత్​ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కోల్ మినిస్ట్రీ చర్యలు చేపట్టిందన్నారు. విద్యుత్​ కేంద్రం నిర్మాణానికి ఇప్పటికే రూ.1.72 కోట్లను రిలీజ్ చేసిందన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ​సైన్స్​ అండ్ ​టెక్నాలజీ సంస్థ బోర్ వెల్ ​నుంచి నిరంతరం వచ్చే వేడి నీటి ద్వారా 20 కిలోవాట్ల నుంచి 100 కిలో వాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్ధారించినట్లు చెప్పారు. అందుకు అవసరమైన సహకారాన్ని సింగరేణి కంపెనీ అందిస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థ, శ్రీరామ్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ ​భాగస్వామ్యంతో ఈ విద్యుత్​ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు వివరించారు.