హోటల్ బిల్లు రూ.2.65 కోట్లు

హోటల్ బిల్లు రూ.2.65 కోట్లు

శ్రీనగర్​: స్టార్​ హోటళ్లలో నిర్బంధించిన జమ్మూకాశ్మీర్​ నేతల మెయింటెనెన్స్​ ఖర్చులు తడిసిమోపెడవుతుండటం ప్రభుత్వా నికి తలనొప్పిగా మారింది. మూడునెలలకు ఏకంగా రూ.2.65 కోట్ల బిల్లు రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఖర్చు తగ్గేలా నేతల్ని వెంటనే వేరే చోటికి షిప్ట్ చేయాలని డిసైడయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనపై నిర్ణయంతీసుకున్న రోజు (ఆగస్టు 5) నుంచి కీలక నేతల్నిపోలీసులు నిర్బంధించారు. ఎక్కడిక్కడే హోటళ్లు,గెస్ట్​హౌజులను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి వాటిలోఉంచా రు. మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ శ్రీనగర్​లోని చష్మా షాహి గెస్ట్​ హౌస్ లో, ఒమర్​ అబ్దుల్లా నెహ్రూ గెస్ట్​హౌస్ లో నిర్బంధంలో ఉన్నారు.సెంటౌర్​​ హోటల్ లో హురియత్ నేత సజ్జాద్ లోన్, జేకేపీఎం చీఫ్ షా ఫైజల్ , ఎన్సీకి చెందిన అలీమొహ్మద్ సాగర్, పీడీపీ నేత నయీమ్ అఖ్తార్​తోపాటు 34 మంది రాజకీయ ఖైదీలున్నారు.90రోజులకుగాను వీళ్ల బసకు రూ.2.65 కోట్లు చెల్లించాలంటూ ఐటీడీసీ సోమవారం కేంద్ర హోంశాఖను సంప్రదించింది. అధికారులు మాత్రం ఇంత మొత్తాన్ని చెల్లించలేమని, గవర్నమెంట్ లెక్కప్రకారం ఒక్కో ఖైదీకి రూ.800 చొప్పున ఇస్తామని పేర్కొన్నారు.