V6 News

హైడ్రాకు రూ.25 కోట్లు రిలీజ్

హైడ్రాకు రూ.25 కోట్లు రిలీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం  రూ. 25 కోట్లు కేటాయించింది.  ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ నిధులు జీహెచ్ఎంసీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణ, వరదల నిర్వహణ, నగర విపత్తు నిర్వహణ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నారు.  ఈ ఏడాది బట్జట్​లో హైడ్రాకు రూ.100 కోట్లు కేటాయించగా, అందులో ఇదివరకే రూ.25 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో రూ.25 కోట్లు విడుదల చేయగా,  మరో రూ.50 కోట్లు  విడుదల చేయాల్సి ఉంది.