హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎలక్షన్కోడ్ నేపథ్యంలో స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్ రూ.25 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధరకు చెందిన శ్రీజైరాం తలాసియా అనే వ్యక్తి సోమవారం కారులో యూసుఫ్‌గూడ వైపు వెళ్తున్నాడు. మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారథి స్టూడియో సమీపంలో సర్వేలెన్స్ టీం తనిఖీలు చేపడుతుండగా ఆయన కారులో రూ.25 లక్షలు దొరికాయి. స్వాధీనం చేసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సరైన ఆధారాలు చూపించి నగదు తీసుకెళ్లాలని సూచించారు.
