
తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై బాగా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలును ముమ్మరంగా తనిఖీలు చేస్తుంది.
తాజాగా అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగూడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2.9 కోట్ల హవాలా డబ్బును పోలీసులు గుర్తించారు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారుతో పాటుగా బైకును కూడా సీజ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు... మాదాపూర్ లో రూ. 32 లక్షల9 వేలు, గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో రూ. 10 లక్షల 39 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు .