మల్యాల మండల కేంద్రంలో రామ మందిరానికి రూ.3 లక్షల విరాళం

మల్యాల మండల కేంద్రంలో రామ మందిరానికి రూ.3 లక్షల విరాళం

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక వార్డు మాజీ సభ్యుడు కాలికంటి స్వామిగౌడ్–పద్మ దంపతులు రూ.3 లక్షల విరాళం అందజేశారు. 

నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా స్వామిగౌడ్ ను సంప్రదించగా.. ఆలయంలో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు తానే అందజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల జనార్దన్ రెడ్డి, పెద్దలు కుందారపు శంకర్, అల్లూరి రాజేశ్వర్, నేరెళ్ల భూమిరెడ్డి, గోవర్ధన్, ప్రసాద్, శ్రీనివాస్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.