రాష్ట్రానికి రూ. 320 కోట్లు కేటాయించిన వరల్డ్ బ్యాంక్

రాష్ట్రానికి రూ. 320 కోట్లు కేటాయించిన వరల్డ్ బ్యాంక్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రోడ్ సేఫ్టీకి వరల్డ్ బ్యాంక్ రూ.320 కోట్ల నిధులు కేటాయించినట్లు సీఎస్​ సోమేశ్ కుమార్​ తెలిపారు. హైదరాబాద్ బీఆర్​కే భవన్​లో రోడ్లు, రవాణా, పోలీస్​ శాఖల అధికారులతో పాటు వరల్డ్​ బ్యాంక్​ టీంతో శుక్రవారం ఆయన రివ్యూ నిర్వహించారు. వెహికల్స్, రోడ్ నెట్‌‌వర్క్ పొడవు, రోడ్డు ప్రమాద మరణాల ఆధారంగా దేశంలోని 14 రాష్ట్రాలకు ప్రంపంచ బ్యాంకు రూ.6,725 కోట్ల నిధులను కేటాయించిందని, అందులో 
తెలంగాణకు రూ.320 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్ యాక్సిడెంట్ల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎస్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. ఈ మీటింగ్​లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అర్నాబ్ బందోపాధ్యాయ, వెంకట్ రావు, విజేత బెజ్జం, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ  జితేందర్, రైల్, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య తదితరులు  ఇతర అధికారులు పాల్గొన్నారు.