ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్​కు విశేష స్పందన

ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్​కు విశేష స్పందన
  • 5 శాతం డిస్కౌంట్​తో రూ.400 కోట్లు వసూళ్లు

హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్​కు విశేష స్పందన లభించింది. గత నెలలో ప్రాప ర్టీ ట్యాక్స్ కట్టేందుకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇవ్వగా రూ.400.36 కోట్లు వసూలైందని సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే. శ్రీదేవి శనివారం పత్రికా ప్రకటనలో తెలిపారు.

గతేడాది ఏప్రిల్ లో రూ.317 కోట్లు వసూలు కాగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ వసూలైందని చెప్పారు.  2025–26 ఆర్థిక సంవత్సరానికి 2264.84 కోట్లు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో 50శాతం కంటే ఎక్కువ వసూలైయినట్టు ఆమె వివరించారు.