పీర్జాదిగూడ కార్పొరేషన్​లో రూ. 5 కోట్ల నిధుల గోల్​మాల్

పీర్జాదిగూడ కార్పొరేషన్​లో రూ. 5 కోట్ల నిధుల గోల్​మాల్

మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కార్పొరేషన్​లో రూ . 5 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్టు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు. భోజనాల ఖర్చు కింద రూ.3 కోట్లు, డంపింగ్ యార్డు సుందరీకరణ కింద రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించి ప్రజాధనం పక్కదారి పట్టించారని ఆరోపించారు.

ఫైవ్ స్టార్ హోటల్ రేట్లు చూపుతూ భోజన బిల్లులతో చెల్లింపులు జరిపారా..? అని ప్రశ్నిస్తూ  శుక్రవారం ఆయన మీడియాకు కార్పొరేషన్ లో నిధుల పక్కదారిపై వివరాలు తెలిపారు. పీర్జాదిగూడ మేయర్ కూడా కార్పొరేషన్​ను దివాలా తీయించాడని ఆరోపించారు. మేయర్ అత్యుత్సాహంతో కోట్ల నిధులు దారి మళ్లించారని పేర్కొన్నారు.