
రాష్ట్రంలో దాదాపు 2 వేల మంది కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు రూ .50 వేల ఆర్థికసాయం చేస్తామని అస్సాం ప్రభుత్వం డిసెంబర్ 17న ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశాల మేరకు తమ శాఖ త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి నబా కుమార్ డోలే తెలియజేశారు. ‘సిల్పి సంబర్ధన’, ‘బ్రహ్మాయమన్ థియేటర్ సిల్పి అరు కళా-కుశాలి అచోని’ పథకాల కింద మొత్తం 2 వేల మంది కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నాగరణం, ఓజపాలి కళాకారులతో పాటు వివిధ కళారూపాలకు చెందిన జానపద కళాకారులు మరియు రాష్ట్రంలోని గిరిజనులకు ‘సిల్పి సంబోధన’ పథకం కింద ఒకేసారి 50 వేల రూపాయలు మంజూరు చేయనున్నారు. కిందిస్థాయి కళాకారులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తారు. అంతేకాకుండా.. సంచార కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు కూడా రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరపున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సహాయ పథకాలు కళాకారులు మరియు సాంకేతిక నిపుణులను కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తాయని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
For More News..