ఇటీవల పిల్లలను ఎత్తుకెళ్లున్న సంఘటనలు చాలా చూస్తున్నాం.దేశవ్యాప్తంగా పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు మారువేషాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి పిల్లల్ని దొంగి లిస్తున్నారు. వీరి టార్గెట్ ఎక్కువగా ఆస్పత్రులే.మరోవైపు గ్రామాల్లో సైతం ఇలాంటి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని ఇటీవల ప్రచారం జోరం దుకుంది. ఈక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేసన్ రంగంలోకి దిగింది. దేశరాజధాని ఢిల్లీలో పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు..పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలో చిల్డ్రెన్స్ ట్రాఫికింగ్ కు సంబంధమున్న పలు ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఢిల్లీలోని కేశవాపురంలో ముగ్గురు అప్పుడే పుట్టిన చిన్నారులను రక్షించారు.ఢిల్లిలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది మంది పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులను CBI అరెస్ట్ చేసింది. అరెస్టయిన ముఠాలో ఆస్పత్రిలో పనిచేసే వార్డు బాయ్ తో సహా మహిళ ఉన్నారు.
చిన్నారులను ఎత్తుకొచ్చి అమ్ముతున్న ఇద్దరు మహిళలను సీబీఐ విచారించగా సంచలన విషయాలు బయటికొచ్చాయి. అప్పుడే పుట్టిన పిల్లలను ఎత్తుకొచ్చి.. బ్లాక్ మార్కెట్లో అమ్మి అక్రమంగా సంపాదిస్తున్నారు. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం..గతనెలలో(మార్చి) 10 మంది అప్పుడే పుట్టిన చిన్నారులను ఎత్తుకొచ్చి అమ్మినట్లు తేలింది. ఒక్కోశిశువుకు రూ.4 లక్షలనుంచి రూ.5లక్షల వరకు ధర నిర్ణయించి అమ్ముతున్నట్లు తేలింది. చిల్డ్రెన్స్ ట్రాఫికింగ్ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఏడుగురిని అరెస్ట్ చేసింది. దేశంలో రోజురోజుకు పెరిగిపెతున్న పిల్లల అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ప్రధాన ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టిం ది సీబీఐ.