
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ వయా కొచ్చిన్ మీదుగా వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 1.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి నిందితుడు బంగారాన్ని విమానం బాత్ రూమ్‌లో దాచాడు. అయితే కస్టమ్స్ అధికారుల విచారణలో బంగారాన్ని బాత్‌రూంలో దాచినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దాంతో నిందితుడి మీద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.