అధిక వడ్డీ ఇస్తామని అసలు డబ్బుతో ఉడాయించారు.

అధిక వడ్డీ ఇస్తామని అసలు డబ్బుతో ఉడాయించారు.

అతి తక్కువ సమయంలో అధిక వడ్డి ఇస్తామని ఆశ చూపించి రుణాలు ఎగ్గొట్టి ఉడాయించిన ఓ ముస్లిం జంట భారీ మోసం పాతబస్తీలో ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటన సైదాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి దాదాపు 100మంది నుంచి లక్షల్లో వసూలు చేసి ఆ డబ్బుతో ఉడాయించారు. ఆ జంటను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాత బస్తీ లోని సైదాబాద్, మలక్ పేట, డబిర్ పుర,సంతోష్ నగర్,చార్మినార్ ఇతర  ప్రాంతాల్లోని ప్రజల నుంచి డబిర్ పురకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్ ఉర్ రహ్మాన్ లు మాయమాటలు చెప్పి డబ్బు తీసుకున్నారు. తాము  UIRC( యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్)  అనే సంస్థలో పని చేస్తున్నామని, ఆ  సొసైటీ ద్వారా పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని..  నమ్మించి ఒక్కొక్కరి నుంచి 1లక్ష నుంచి 90 లక్షలు వరకు వసూలు చేసారు. దాదాపు వంద మంది నుంచి 9కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుతో ఉడాయించారు. బాధితులు డబ్బులు అడిగేందుకు వారి ఇంటికి వెళితే.. వారి కుటుంబీకులు కొట్టారని,  ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆ 30 మంది బాధితులు సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.