పద్మారావునగర్, వెలుగు: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన కొత్త మందులతో అస్తమాను సులభంగా ఎదుర్కోవచ్చని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ప్రపంచ అస్తమా దినోత్సవం సందర్భంగా బేగంపేటలో నిర్వహించిన ‘వన్ కే రన్’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధితుల కోసం కేవలం 999 రూపాయలకే ప్రత్యేక ‘అస్తమా కిట్’ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. ప్రజల్లో అపోహలు తొలగించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని, బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
