TSPSC సభ్యులంతా సీఎం కేసీఆర్ అనుచరులు, సన్నిహితులే..

TSPSC సభ్యులంతా సీఎం కేసీఆర్ అనుచరులు, సన్నిహితులే..

TSPSC వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. TSPSC చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘంటా చక్రపాణి హయాంలో రాజశేఖర్ రెడ్డి పేపర్ లీక్  జైలుకు వెళ్లొచ్చాడని... ప్రస్తుత TSPSC సభ్యులంతా మెజారిటీగా ముఖ్యమంత్రి అనుచరులు...సన్నిహితులే ఆరోపించారు. జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా నుండి వచ్చి రాసిన వారు కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నారని... జనార్దన్ రెడ్డికి తెలియకుండా ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా పోయాయని నిలదీశారు. ప్రవీణ్,రాజశేఖర్ రెడ్డితో ఈ కేసు పూర్తి చేయాలనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని..జనార్దన్ రెడ్డిని ఆయన కాపాడుతున్నారని చెప్పారు. జనార్థన్ రెడ్డి  నోరు తెలిస్తే దొంగలు బయట పడుతారన్నారు. జనార్దన్ రెడ్డి,బోర్డు సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు?  2016 గ్రూప్ 1 మీద కూడా సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 

పేపర్ లీకులు సాధారణమైనవని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తాను సెక్రటరీగా ఉన్నపుడు ఎక్కడా లీకులు కాలేదని గుర్తు చేశారు. మోండా మార్కెట్ కంటే దారుణంగా ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని మండిపడ్డారు. హనీట్రాప్,హ్యాకింగ్ అంటూ పక్కదోవ పట్టించే కుట్ర చేశారని విమర్శించారు. TSPSC లోనే 10మంది టాప్ మార్కులు తెచ్చుకున్నారని...దొంగలంతా కమిషన్ ఆఫీసులోనే ఉన్నారని ఆరోపించారు.  ప్రవీణ్ OMR షీట్ మార్చింది అధికారులే అని వెల్లడించారు.  గ్రూప్ 1 2016 నోటిఫికేషన్ లో కూడా అవినీతి జరిగిందని...ఇందులో జాగృతి నాయకులు పాసయ్యారని గుర్తు చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రావద్దనే అధికారం ఓయూ వైస్ ఛాన్సలర్ కు లేదన్నారు. ఓయూలో ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. పూర్వ విద్యార్థులుగా ఓయూకు వచ్చే అధికారం తమకు ఉంటుందన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని..దాన్ని అడ్డుకునే అధికారం వీసికి లేదని చెప్పారు. విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు ఓయూకు వచ్చానని....వీసి కూడా కేసీఅర్ లా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా విద్యార్థులంతా లీకుల పట్ల ఆందోళనలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులే తెలంగాణ తెచ్చారని....కానీ ఈరోజు తెలంగాన రాబందు పాలైందన్నారు.   ముఖ్యమంత్రి ఆఫీసులో ఏం కుట్రలు జరుగుతున్నాయో  విద్యార్థులకు తెలియడం లేదన్నారు. పేపర్లు ఎలా లభించాయని అడుగగలరా అని వీసీని ప్రశ్నించారు. తాను చెప్పేవరకు సురేష్,రమేష్,షమీమ్ లను అరెస్టు చేయలేదన్నారు.