రాష్ట్ర రైతుల పొట్టలు కొట్టి పరాయివాళ్లకు ఫలహారమా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్ర రైతుల పొట్టలు కొట్టి పరాయివాళ్లకు ఫలహారమా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ సర్కార్పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ సొంత రాష్ట్ర రైతుల పొట్టలు కొట్టి పరాయి రాష్ట్ర రైతులకు ఫలహారం ఇస్తోందని ఆరోపించారు. మొదట రాష్ట్ర రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. దీనికి సంబంధించి V6 వెలుగులో వచ్చిన ‘‘మహా రైతులకు పరిహారం మన రైతులకు పరిహాసం’’ అనే కథనాన్ని ఆయన ట్వీట్ చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో మూడు జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నా మన రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు మహారాష్ర్ట పరిధిలో మునుగుతున్న భూములను పూర్తిస్థాయిలో సేకరించేందుకు మాత్రం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.11.40 లక్షలు, బీడు భూములకు రూ.10 లక్షలు చెల్లించడానికి తెలంగాణ సర్కారు ఒప్పుకుందని, త్వరలోనే పరిహారం పైసలు అందజేస్తామని మహారాష్ర్ట అధికారులు అక్కడి ముంపు రైతులకు తెలిపారు. దీంతో 'మహా’ రైతులపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న మన ప్రభుత్వం సొంత రాష్ర్టంలోని తమ గోడును మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ ప్రాంత రైతులు మండిపడుతున్నారు.