ఎప్పుడొస్తారో చెప్పండి?..రెండోసారి సిట్ నోటీసులు జారీ

ఎప్పుడొస్తారో చెప్పండి?..రెండోసారి సిట్ నోటీసులు జారీ
  • ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోనోటీసులకు స్పందించని ఆరెస్పీ​
  • రెండోసారి సిట్ నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కు సిట్ అధికారులుగా వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచి స్తున్నారు. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. నోటీసులు అందిన వెంటనే రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే రావచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్​లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఈ నోటీసులకు ప్రవీణ్ కుమార్ స్పందించలేదు.

దీంతో శుక్రవారం మరో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. ఎప్పుడు హాజరు అవు తారో తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. జూబ్లీహిల్స్ పీఎస్ లోని ఏసీపీ ఆఫీసులో లేదా ఆయన తెలిపిన ప్రాంతానికే వచ్చి వాం గ్మూలం తీసుకుంటామని పేర్కొన్నారు. వీఆర్ తీసుకున్న తరువాత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ విషయంలోను బీఆర్ఎస్​ను ప్రశ్నించారు. అదే సమయంలో తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అప్పటి డీజీపీకి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదులు చేశారు.