తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం: RS ప్రవీణ్ కుమార్

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం: RS ప్రవీణ్ కుమార్

టీఎస్ పీఎస్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  పేపర్ లీక్  కేసును కేటీఆర్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు.   కేసులో కొందరిని తప్పించే ప్రయత్నం  జరుగుతోందన్నారు.    సీఎం కార్యాలయమే లీక్ కుంభకోణం జరిపించిందని ఆరోపించారు. 

పేపర్ లీక్  కుంభకోణంలో  టీఎస్ పీఎస్ సీ చైర్మన్ సహా అందరికీ సంబందం ఉందన్నారు ప్రవీణ్ కుమార్.  సీఎం ఆయన కుటుంబం కోసమే ఇంటలీజెన్స్  పనిచేస్తోందని విమర్శించారు.  తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను తాము బహిష్కరిస్తున్నామని అన్నారు.  

రాష్ట్రంలో ఇవాళ రైతులు ధాన్యం అమ్ముకోవడానికి పడిగాపులు గాస్తున్నారని ధ్వజమెత్తారు.  రైస్ మిల్లర్ల దోపిడికి తెరలేపింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఇవాళ  ఇసుక దోపిడికి లారీలు దొరుకుతున్నాయి కానీ.. రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి లారీలు దొరుకుతలేవని అన్నారు. 

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.  జూన్ 20న జరిగే విద్యాదినోత్సవాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.