కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరవు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరవు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఒంటరి మహిళను ఆక్రమంగా నిర్బంధించి పోలీసులు లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన దురదృష్టకరమని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈ ఘటనను ఖండిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ పోలీసులు చేతిలో గాయపడ్డ గిరిజన మహిళ బాధితురాలు లక్ష్మీని హస్తినపురంలోని శ్యామ్ హాస్పిటల్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం(ఆగస్టు 20) ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చెయ్యని నేరానికి లక్ష్మి పోలీస్ లు స్టేషన్ కి తీసుకొని వెళ్ళి, ఆమెను కొట్టి.. రూ. 3 లక్షలు, బంగారం తీసుకోవడం పోలీసులే దొంగలుగా వ్యవహరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కూతురు పెళ్లి ఉందని చెప్పిన కనికరం లేకుండా పోలీసులు వ్యవహరించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.