బహుజన రాజ్యం కోసం పోరాటం ఆగదు

బహుజన రాజ్యం కోసం పోరాటం ఆగదు
  •    యువకుల సైకిల్ యాత్ర స్ఫూర్తిదాయకం
  •     కమీషన్లు, దందాల లీడర్లు చాలా మంది ఉన్నరని కామెంట్‌‌‌‌‌‌‌‌

ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌పై నీలి జెండా ఎగురేసి బహుజన రాజ్యాన్ని తీసుకువచ్చే వరకు తమ పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్వేరో స్టూడెంట్స్ యూత్ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌‌‌‌‌‌‌‌లో ముగిసింది. ముగింపు యాత్రకు హాజరైన ప్రవీణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమ్రంభీం విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత కెరమెరి మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన స్వేరో స్టూడెంట్ యూనియన్ బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. బహుజన రాజ్యం స్ధాపించాలన్న లక్ష్యంతో 15 మంది యువకులు 37 రోజులపాటు చేసిన 1,700 కిలోమీటర్ల సైకిల్‌‌‌‌‌‌‌‌ యాత్ర తనలో కొత్త స్ఫూర్తి నింపిందని ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ప్రగతి భవన్ తన సొంతం అన్నట్టుగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహరిస్తున్నారని చెప్పారు. దళిత బహుజనుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకు స్వస్తి చెబుతామన్నారు. బీఎస్పీ జెండా ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌పై ఎగిరే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, కార్పొరేట్ కాలేజీలలో కమీషస్ల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉండే స్టూడెంట్ యూనియన్లు పని చేస్తున్నాయని విమర్శించారు. స్వేరో స్టూడెంట్స్ మాత్రం ప్రజల సమస్యలపై పోరాడుతున్నారన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు పాలనలో దళితుaలు, గిరిజనులపై చిత్రహింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రవీణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు. దోపిడీ పాలనను అంతం చేసేందుకే పోరాట గడ్డ జోడేఘాట్‌‌‌‌‌‌‌‌ను ముద్దాడామని చెప్పారు. ప్రస్తుల పాలకులు మనల్ని మోసం చేస్తున్నారని, చైతన్యవంతులై మన చరిత్రను మనమే రాసుకోవాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదరికం పోతుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.