కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు

కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు

గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ కాంగ్రెస్​లో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్​గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో నడిచేందుకు ఆయన తమ్ముడు, ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న ప్రసన్నకుమార్ ​తన పదవికి రాజీనామా చేశారు.

 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ ​బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి గుడ్ బై చెప్పడంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ తో కలిసి వెళ్లిన ప్రసన్నకుమార్​ కాంగ్రెస్​లో చేరారు. అభ్యర్థి తమ్ముడే పార్టీ మారడం, అది కేటీఆర్ ప్రోగ్రాం అలంపూర్​లో ఉన్న రోజే కావడం చర్చనీయాంశమైంది.