ఏఐ సొల్యూషన్కు రూ.కోటి నజరానా

ఏఐ సొల్యూషన్కు రూ.కోటి నజరానా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఇండియన్ కంపెనీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు నడిపించేందుకు  ఏఐ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెంట్‌‌‌‌తో  కంటెంట్ క్రియేటర్, పారిశ్రామికవేత్త  రాజ్ షమానీ చేతులు కలిపారు.   దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక పోటీని ప్రకటించారు. 

తమ వ్యాపారాల్లోని వాస్తవ సమస్యలను గుర్తించి, ఎమర్జెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ సాయంతో ఏఐ పరిష్కారాలు చూపే మూడు సంస్థలకు సంయుక్తంగా రూ.  కోటి నగదు బహుమతి అందజేయనున్నారు.  ఎమర్జెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా కోడింగ్ నైపుణ్యం లేకపోయినా సాధారణ భాషలోనే పూర్తి స్థాయి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ అప్లికేషన్లను రూపొందించుకోవచ్చని ఆయన తెలిపారు.  

అంతేకాకుండా మాన్యువల్ విధానాలపై ఆధారపడే తయారీ, లాజిస్టిక్స్, డీ2సీ, కుటుంబ వ్యాపారాలు, ఇన్వెంటరీ, వర్క్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఆటోమేషన్,  ఆర్డర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం దీనిని వాడుకోవచ్చు.  ఈ ప్రచారంలో భాగంగా రాజ్ షమానీ స్వయంగా ఎమర్జెంట్ ద్వారా తన వ్యాపారానికి ఏఐ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను రూపొందించి ప్రదర్శించారు.